పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధిక వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికే ఫిర్యాదులు అందాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.137 వినతులు రాగా వీటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి 58 వినతులు రావడం విశేషం. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 7, రెవెన్యూ సెక్షన్‌కు 13, ప్రజారోగ్య విభాగానికి 8, ఇంజినీరింగ్ విభాగానికి 26, మొక్కల విభాగానికి 7, యూసీడీ విభాగానికి 18 ఫిర్యాదులు వచ్చాయి. అందిన ఫిర్యాదులు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్‌కుమార్, ఏడుకొండలు, డీసీఆర్ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.


