
ఉద్యమం.. ఉధృతం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే, త్వరలో ఈ ప్రాంత కూటమి ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం.ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు దగ్గరుండి ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా కూటమి ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. చంద్రబాబు మళ్లీ అభివృద్ధిని అమరావతికే కేంద్రీకరించి, లక్షల కోట్లు అప్పు చేసి ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. విశాఖలో విలువైన భూములను లులు, ఉర్సా వంటి సంస్థలకు కారుచౌకగా ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడానికి మేధావులు, రాజకీయ నేతలు ఐక్యంగా పోరాడాలి., ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వచ్చే అన్ని అఖిల పక్ష రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకువెళతాం. – కేకే రాజు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు