
మైత్రి వాక్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ
మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 6న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ‘మైత్రి వాక్ 2.0’ పోస్టర్‌ను మంగళవారం ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ జెనెటిక్స్ విభాగం, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఇంక్లూషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పోస్టర్ ఆవిష్కరణలో ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎంవీఆర్ రాజు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ. నరసింహారావు, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, హ్యూమన్ జెనెటిక్స్ విభాగాధిపతి ఆచార్య వి. లక్ష్మి, సెంటర్ సెంటర్ ఫర్ సోషల్ ఇంక్లూజన్ డైరెక్టర్ డాక్టర్ పి. సుబ్బారావు, ఆచార్య జి. సుధాకర్, ఆచార్య జి. పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.