
ఏయూలో 17న ఎన్‌ఎస్టీఎల్ అకడమిక్ కాన్ఫరెన్స్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం నేవల్ సైన్స్ టెక్నాలాజికల్ లేబరేటరీ (ఎన్‌ఎస్టీఎల్) సహకారంతో ఈనెల 17వ తేదీన ఎన్‌ఎస్టీఎల్ అకడమిక్ కాన్ఫరెన్స్– 2025ను నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ తెలిపారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా సదస్సు నిర్వహించనున్నామన్నారు. బ్రోచర్, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను ఎన్‌ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం, ఏయూ వీసీ జీపీ రాజశేఖర్ ఆవిష్కరించారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఇటువంటి సాంకేతిక కార్యక్రమం విశ్వవిద్యాలయానికి మరింత ప్రతిష్టను అందిస్తుందని వీసీ చెప్పారు.