
ఎడమ కాలితో పరీక్ష రాసి ఉద్యోగం
సింహాచలం నాయుడిని అభినందించిన కలెక్టర్
మహారాణిపేట: పుట్టుకతోనే రెండు చేతుల అంగవైకల్యం ఉన్నా, ఎడమ కాలుతో పరీక్ష రాసి మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం (ఎస్జీటీ) సాధించిన జామి సింహాచలం నాయుడును కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అభినందించారు. కష్టపడి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా గనిశెట్టిపాలేనికి చెందిన నాయుడు.. రాష్ట్ర స్థాయిలో 320 వ ర్యాంకు సాధించగా, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు వచ్చింది. అయితే ఆయన ఓపెన్ కేటగిరీలోనే ఉద్యోగం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జేసీ కె. మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.