
వీఆర్వోల అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎన్నిక
పరవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అసోసియేట్ అధ్యక్షుడిగా పరవాడ మండలం, భరణికం గ్రామ రెవెన్యూ అధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాసరావును రాష్ట్ర వీఆర్వో సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, విశాఖ జిల్లా పూర్వపు అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ రామదాస్, రాష్ట్ర వీఆర్వోల అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు పోతుల శంకరరావు తదితరులు శ్రీనివాసరావును అభినందించారు.