
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
మర్రిపాలెం: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన నడుస్తోందని, దీని వల్ల ప్రజలు, పలు శాఖల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ భాషా అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కార్పొరేటర్ బర్కత్ అలీ, పలు ముస్లిం సంఘాల ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రెడ్ బుక్ పాలన నుంచి విముక్తి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయా సమస్యలను తక్కువ వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఐహెచ్ ఫరూఖీ, పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.