
ఉత్సాహంగా దాండియా నైట్
మురళీనగర్: మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాండియా నైట్ సాంస్కృతిక కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలో 300 మంది దాండియా కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన నృత్యరీతులను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీసు కమిషనరు డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడి, దాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, బీజేపీ ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జి దీపికా శ్యామల, సునీల్ అగర్వాల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగలి జగన్నాథం, వైశాఖి స్పోర్ట్సు పార్కు అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. వరప్రసాద్, రాజు పాల్గొన్నారు.