
విజిలెన్స్ అవగాహన వాక్‌థాన్
సీతంపేట: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం విజిలెన్స్ అవగాహన వాక్‌థాన్, సముద్రతీర శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తొలుత ద్వారకానగర్‌లో ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలు విజిలెన్స్ వాక్‌థాన్‌లో పాల్గొని, పాలనలో జాగ్రత్త (విజిలెన్స్), పారదర్శకత ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లో సముద్రతీర శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రధాన అధికారి ఏవీ రమణమూర్తి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి జాగ్రత్త (విజిలెన్స్), శుభ్రత రెండూ తప్పనిసరి అని అన్నారు.