
ఈపీడీసీఎల్‌తో ఫ్లూయెంట్‌గ్రిడ్, సీసీఎఫ్ ఒప్పందాలు
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరాలో నాణ్యత, వ్యవస్థలో ఆధునికీకరణ, ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత వేగవంతం చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ సరికొత్త ఒప్పందాలు చేసుకుంది. సాగర్‌నగర్‌లోని ఈసీబీసీ భవనంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (సీవోఈఈటీ) కోసం ఫ్లూయెంట్‌గ్రిడ్, కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ (సీసీఎఫ్) సంస్థలు ఏపీఈపీడీసీఎల్‌తో గురువారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ ఆధునికీకరణ, కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యంగా కొత్త స్టార్టప్‌లను గుర్తించడం, ప్రోత్సహించడం ఈ ఎంవోయూల ద్వారా నిర్వహించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ గ్రిడ్ ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను పరీక్షించి, మెరుగులద్దనున్నారు. యునెజా, గ్రెయిల్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల సహాయంతో నాలెడ్జ్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంయుక్త పరిశోధన పత్రాల ప్రచురణకు తోడ్పడుతుంది. అదేవిధంగా విశాఖ ఎనర్జీ సమ్మిట్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లను నిర్వహిస్తూ, పరిశ్రమ నేతలు, స్టార్టప్‌లు, నిపుణుల ప్యానెల్ చర్చలు, ఉద్యోగ–నైపుణ్య మేళాలు ఈ సంస్థల సహకారంతో ఈపీడీసీఎల్ ఏర్పాటు చేస్తుంది. ఫ్లూయెంట్‌గ్రిడ్ ఎంవోయూలో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో స్మార్ట్ గ్రిడ్ కమాండ్–కంట్రోల్ సెంటర్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా స్థాపించనుంది. ఏఐ ఆధారిత యాక్టిలిజెన్స్ గ్రిడ్ మోడరనైజషన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించి సైదీ, సైఫీ అంచనాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు నిర్వహణ, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్స్ మేనేజ్మెంట్, రియల్‌టైమ్ డేటా యాక్సెస్‌కు ఏఐ అసిస్టెంట్ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శిస్తుంది. విపత్తు నిర్వహణలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపు, వాటికి అనుగుణంగా నెట్‌వర్క్‌ను పటిష్టపరిచేందుకు సూచనలు అందించనుంది. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మాట్లాడుతూ కొత్తగా కుదుర్చుకున్న ఎంవోయూలు పునరుత్పాదక ఇంధన రంగం, ఎనర్జీ ట్రాన్సిషన్‌లో జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర పోషించేందుకు తోడ్పతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.