
ఆధారాలు చూపని నగదు స్వాధీనం
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు చూపకుండా అధిక మొత్తంలో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ అధికారులు తెలిపిన వివరాలు... జీఆర్పీ, రైల్వే భద్రతా దళం బుధ వారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తెలంగాణా, నిజామాబాద్ జిలాకు చెందిన ముగ్గురు విశాఖ మీదుగా ఒడిశా రాష్ట్రం, కంఠాబంజికు వెళ్తున్నారు. వీరు తమతో ఎలాంటి పత్రాల్లే కుండా రూ.43 లక్షలు తరలిస్తున్నారు. దీన్ని తెలంగాణాలో తమ ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలకు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వీరితోపాటు, వీరి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును మహారాణిపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచినట్లు పేర్కొన్నారు.