
మేయర్‌కు నిరసన సెగ
పీలా ఇంటి ముందు చిరు వ్యాపారుల బైఠాయింపు
పెందుర్తి: ఆపరేషన్ లంగ్స్ పేరిట బడ్డీలను తొలగించడంపై చిరువ్యాపారులు కన్నెర్రజేశారు. దుకాణాల తొలగింపు బాధిత చిరు వ్యాపారులంతా పెందుర్తిలోని మేయర్ పీలా శ్రీనివాసరావు ఇంటి ముందు బైఠాయించారు. మేయర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన మేయర్ పీలా శ్రీనివాసరావు బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దుకాణాలు తొలగించిన వారు ఆందోళన చెందవద్దని చెప్పారు. అర్హులైన పేదలను గుర్తించి వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించారు. కాగా మేయర్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.