
పోర్టు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా అంగముత్తు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) చైర్మన్‌గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీపీఏ చైర్మన్‌గా ఉన్న డా.అంగముత్తు ఈ నెల 22న ముంబై పోర్టు చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయ్యాక.. కొత్త చైర్మన్‌ని నియమించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్‌ని నియమించే వరకూ లేదా ఆరు నెలల కాలం వరకూ వీపీఏ చైర్మన్‌గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.