
జైల్‌ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్
ఆరిలోవ: దేవి నవరాత్రులు సందర్భంగా మహిళలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె బుధవారం సందర్శించారు. జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లతో కలిసి మహిళా ఖైదీల బ్యారక్‌ను పరిశీలించారు. అక్కడ మహిళలతో సమావేశమై, పలు అంశాలపై అవగాహన కలిగించారు. వారికి పోషకాహారం అందించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. జైల్లోని బ్యారక్‌లను, ఖైదీలు పనిచేస్తున్న వివిధ పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం జైల్ బయటకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నారీ పరివార్ అభియాన్‌లో భాగంగా ‘పోషణ్ మా’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జైల్‌లో మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. కారాగారంలో 80 మంది మహిళా ఖైదీలున్నారని, వారిలో సుమారు 50 మంది గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికినవారేనని పేర్కొన్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు చైన్నె, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారున్నట్లు వెల్లడించారు. మహిళలల్లో మంచిమార్పు తీసుకొచ్చి తిరిగి సమాజంలోకి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.