
● దంచి కొట్టిన వాన
మహారాణిపేట: నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు కుండపోతగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డు, డాబాగార్డెన్స్, రైల్వే న్యూ కాలనీ, ఆశీల్‌మెట్ట, దొండపర్తి, చావులమదుం, అక్కయ్యపాలెం, వెలంపేట, పూర్ణా మార్కెట్, కంచరపాలెం, ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, పాత పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

● దంచి కొట్టిన వాన