
ఆదిలక్ష్మి అలంకరణలో కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు. అలంకరణకు నగరానికి చెందిన ఆర్.గణేశ్వరరావు రూ.35వేల రుసుం చెల్లించి పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ అందజేసింది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం కనకమహాలక్ష్మీ ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమివ్వనున్నారని, లక్ష చామంతులతో పూజ నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు.

ఆదిలక్ష్మి అలంకరణలో కనకమహాలక్ష్మి