
సాగరగిరి బోటుకు పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్: దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని సాగర గిరి కనకదుర్గ దేవాలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. సాగర గిరి కనకదుర్గ ఆలయానికి నగరం నుంచి వెళ్లాలంటే సాగరాన్ని దాటాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి నగరం నుంచి రోడ్డు మార్గం లేదు. పోర్టు అథారిటీ అనుమతితో బోటు సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ పాత పోస్టాఫీస్ దరి వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఫెర్రీ నుంచి ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోటు సౌకర్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సాగరగిరి కనకదుర్గ దేవాలయానికి వెళ్లేందుకు భక్తులు పొటెత్తారు.
ఫెర్రీపై రాకపోకలు సాగిస్తున్న భక్తులు