
ఉన్నత విద్యకు మరింత ప్రోత్సాహం
అల్లిపురం: అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా, ది కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్, జిల్లా సహకార శాఖ సంయుక్తంగా రామ్‌నగర్‌లోని పైడా కాలేజీలో సోమవారం బ్యాంకింగ్‌పై అవగాహన సదస్సును నిర్వహించాయి. సదస్సులో భాగంగా బ్యాంకులు అందించే వివిధ సేవలు, పొదుపు ఖాతాల నిర్వహణ, ముఖ్యంగా విద్యా రుణాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు అందిస్తున్న విభిన్న సేవలు, రుణాలు, ఇతర సౌకర్యాలను వివరించారు. ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ బ్యాంకు ప్రత్యేక విద్యా రుణాలను అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్, సహకార శాఖ జిల్లా అధికారి సత్యశ్రీ, ప్రిన్సిపాల్ డాక్టర్ సరోజిని, కనకమహాలక్ష్మీ కో–ఆపరేటివ్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్యామ్‌కిశోర్, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
కనకమహాలక్ష్మీ కో–ఆపరేటివ్ బ్యాంక్
చైర్మన్ రాంబాబు