
వేధింపులు ఆపి.. ఉద్యోగ భద్రత కల్పించాలి
బీచ్‌రోడ్డు : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గునూరు వరలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కార్మికులపై టీడీపీ నాయకులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ల వేధింపులు తీవ్రమయ్యాయని.. అకారణంగా తొలగిస్తూ.. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మనాభం మండలంలో అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవ్వొద్దని కోరారు. కార్మికులకు హామీ ఇచ్చిన విధంగా గ్యాస్ సరఫరా చేయాలని, రెండు నెలల బకాయి బిల్లులను చెల్లించాలని, మెనూ చార్జీలను విద్యార్థికి రూ.20 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు భవాని, జి.మంగశ్రీ, యూనియన్ నాయకులు పి.మణి, రాము, గౌరీ, నర్సియమ్మ, ధనలక్ష్మి, సావిత్రి పాల్గొన్నారు
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు,
స్కూల్ శానిటేషన్ వర్కర్ల ధర్నా