
వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ లోగో ఆవిష్కరణ
విశాఖ సిటీ: ‘వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్’ విశాఖపట్నం లోగోను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న నగర క్రీడాకారుల సహాయార్థం ‘ప్రత్యేక క్రీడా సంక్షేమ నిధి’ కోసం నూతనంగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీ కమల్ బయిద్ సీపీకి వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు సామాజిక సేవా సంస్థలు ఆర్థిక సాయాన్ని అందించి ప్రోత్సహించి క్రీడాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ ట్రస్ట్‌ను ప్రారంభించిన కమల్ బయిద్‌తో పాటు ట్రస్టీలు నండూరి రామకృష్ణ , శుభోద్ కుమార్ రాకేచ, డా.మంగ వరప్రసాద్, చింతలపాటి శ్రీనివాసరాజు, కపిల్ అగర్వాల్‌లను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎల్.సుధాకర్, కోశాధికారి ఎం.రామారావు పాల్గొన్నారు.