
వరి పొలంలో మృతదేహం లభ్యం
పద్మనాభం: మండలంలోని విలాస్కాన్‌పాలేనికి చెందిన బోని ముత్యాలనాయుడు(68) ఆదివారం పొలంలో శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. తన తండ్రి ముత్యాలనాయుడు పొలంలోకి వెళ్లి తిరిగి రాలేదని ఈ నెల 18న కుమారుడు నరేష్ పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు చేఽశారు. దీనిపై పోలీసులు ముత్యాలనాయుడు అదృశ్యమైనట్టు కేసు నమోదుచేశారు. ముత్యాలనాయుడు తమ వరి పైరు పొలంలోనే బోర్లాపడి మృతిచెంది ఉన్నాడు. పొలంలో ముత్యాలనాయుడు మృతదేహాన్ని అదే గ్రామానికి చెందిన కాళ్ల శ్రీనివాసరావు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో చూశాడు. ఈ విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలిపాడు. తన తండ్రి గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని కుమారుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముత్యాలనాయుడు మృతదేహం బాగా కుళ్లిపోవడంతో భీమునిపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సంఘటన స్థలానికి వచ్చి, నమూనాలు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.