లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ | - | Sakshi
Sakshi News home page

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

Sep 22 2025 5:57 AM | Updated on Sep 22 2025 5:57 AM

లేపాక

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

● 13వ వార్డు టీడీపీ నాయకుల మౌఖిక ఆదేశాలతో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బరితెగింపు ● వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళనతో తిరిగి పార్టీ జెండా ఏర్పాటు జెండా రాడ్‌ను పొక్లెయిన్‌

● ఉదయం ఎండ.. మధ్యాహ్నం భారీ వాన
ఐ ఫోన్‌ కొనలేదని యువకుడి ఆత్మహత్య

వైఎస్సార్‌సీపీ జెండా తొలగింపుతో

ఉద్రిక్తత

విక్రయానికి తీసుకువెళ్తున్న

ఆరిలోవ: స్థానిక టీడీపీ నేతల మౌఖిక ఆదేశాలకు జీవీఎంసీ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అత్యుత్సాహం తోడవడంతో ఆరిలోవ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఎవరికీ అడ్డంకి లేకుండా, ఐదేళ్లుగా ఉన్న వైఎస్సార్‌సీపీ జెండాను జీవీఎంసీ సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 13వ వార్డు పరిధి ఆరిలోవ ఆఖరు బస్టాప్‌ వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి..

ఆరిలోవ ఆఖరి బస్టాప్‌ వద్ద ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం పక్కనే ఏ వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా 2019లో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. వార్డు టీడీపీ నాయకుల కనుసైగలతో జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌(బీఐ) మహేష్‌ రోడ్డు పక్కన బడ్డీల తొలగింపు ఆదేశాలను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ జెండాను దిమ్మతో సహా పొక్లెయిన్‌తో తొలగించి ముక్కలు చేయించేశారు. అక్కడితో ఆగకుండా ఆ జెండా కర్ర(ఇనుప రాడ్డు)ను పొక్లెయిన్‌ తొట్టెలో వేసుకుని సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న స్క్రాప్‌ దుకాణంలో కిలోల లెక్కన విక్రయించేశారు. విషయం తెలుసుకున్న వార్డులోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ జీవీఎంసీ సిబ్బంది విక్రయించిన స్క్రాప్‌ దుకాణం వద్దకు చేరుకున్నారు. అక్కడ సిబ్బందిని నిలదీయడంతో వెంటనే ఆ జెండా కర్రను అదే పొక్లెయిన్‌లో వేసుకుని తిరిగి తొలగించిన స్థానం వద్దకు తీసుకొచ్చారు.

ఇంతలో వైఎస్సార్‌ విగ్రహం వద్దకు అధిక సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని కూటమి ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొక్లెయిన్‌ డ్రైవర్‌, జీవీఎంసీ సిబ్బందిని నిలదీశారు. దీంతో బీఐ మహేష్‌ చెప్పడం వల్లే తొలగించినట్లు డ్రైవర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మహేష్‌ తొలుత తనకేమీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈలోగా ఆరిలోవ ఎస్‌ఐ రాందాస్‌ సిబ్బందితో చేరుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వారించారు. బీఐ మహేష్‌ను ఎస్‌ఐ ప్రశ్నించడంతో టీడీపీ నాయకుల పేరు చెబితే తనకు ఇబ్బంది అవుతుందని, పార్టీ జెండా తొలగించడం తన తప్పేనంటూ ఒప్పుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శాంతించారు. అనంతరం అక్కడ గొయ్యి తీయించి జెండా ఏర్పాటు చేయించారు. దీనిపై కొంత సేపు నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఇదిలా ఉండగా ఈ చర్యను పార్టీలకు అతీతంగా పలువురు ఖండించారు.

ఈ ఆందోళనలో వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట్‌, రాష్ట్ర చేనేత విభాగం జనరల్‌ సెక్రటరీ వానపల్లి ఈశ్వరరావు, నాయకులు బేత దుర్గారావు, కాకర గోవింద్‌, వంకర బాబూరావు, ప్రసంగి వాసు, పాండ్రంకి శ్రీనివాసరావు, బేగం, పోలారావు, బొండా ఉమామహేష్‌, డాక్టర్‌ నాయుడు, వానపల్లి మంగరాజు, బంగార్రాజు, భాస్కర్‌, కామేశ్వరరావు, రాము, సురేష్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్కాలర్‌షిప్స్‌, బహుమతులతో విద్యార్థులు, జపాన్‌ ప్రతినిధులు

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 1
1/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 2
2/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 3
3/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 4
4/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 5
5/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 6
6/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 7
7/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌ 8
8/8

లేపాక్షిలో ఫెస్టివల్‌ డిస్కౌంట్‌ సేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement