
యువత డ్రగ్స్ బారిన పడొద్దు
ఏయూ క్యాంపస్: యువతరం డ్రగ్స్‌కు బానిసలు కాకుండా, డ్రగ్స్ రహిత దేశంగా నిలిపే దిశగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నమో యువ 3కే రన్ బీచ్‌రోడ్డులో భారతీయ యవ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద రన్‌ని ప్రారంభిస్తూ మాధవ్ మాట్లాడారు. గంజాయి. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారత్ నిలుస్తుందని, ఈ బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు భారతీయులే అధిపతులుగా నిలచారని, వారిని ఆదర్శంగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ రోజు నిర్వహించిన ఈ పరుగు దేశాభివృద్ధి దిశగా యువతను తీసుకెళ్లాలా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, కోశాధికారి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుష్, మీడియా ఇన్‌చార్జి కోటేశ్వరరావు, యువమోర్చా నాయకులు ధోని నాగరాజు, వంశీ యాదవ్, కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.