
నేటి నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో దసరా ఉత్సవాలు
డాబాగార్డెన్స్: బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి వచ్చే నెల 2 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 22న కనకమహాలక్ష్మి స్వర్ణకవచ కిరీటధారిణిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజున అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, సహస్రనామార్చన జరపనున్నారు. 23న ఆదిలక్ష్మిగా దర్శనమిస్తారు. ఆ రోజు విశేష అర్చన, లక్ష కుంకుమార్చన జరుపుతారు. 24న ధనలక్షి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆ రోజు అమ్మవారికి లక్ష చామంతులతో పూజ, 25న ధాన్యలక్ష్మి అవతారంలో లడ్డూల పూజ అందుకుంటారు. 26న ధైర్యలక్ష్మి అవతారంలో తులసీదళాలతో సహస్రనామార్చన నిర్వహించనున్నారు. 27న సంతానలక్ష్మి అవతారంలో కలువపూలతో పూజలందుకుంటారు. 28న విజయలక్ష్మిగా గులాబీల పూజలందుకుంటారు. 29న మూలానక్షత్రం సందర్భంగా విద్యాలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు. 30న గజలక్ష్మి అలంకరణలో లక్ష గాజులతో పూజలందుకుంటారు. అక్టోబర్ 1న మహాలక్ష్మిగా శాకంబరి అలంకరణలో పూజలందుకుంటారు. నవరాత్రుల చివరి రోజు అక్టోబర్ 2న స్వర్ణ కవచాలంకృత కనకమహాలక్ష్మి అమ్మవారికి 108 పుష్పాలతో స్వర్ణపుష్పార్చన నిర్వహించనున్నారు.
ఈదురుగాలులతో కకావికలం