
ఉత్సాహంగా గ్లోబల్ గోల్స్ రన్
ఏయూ క్యాంపస్: బీచ్‌రోడ్డు వేదికగా ఐసెక్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గ్లోబల్ గోల్స్ రన్ 2025 నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నగరవాసులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఆ దిశగా ప్రజలను నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానశ్రీ బోకం తెలిపారు. ఏఐఈఎస్‌ఈసీ ఉపాధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో బాధ్యతను పెంపొందిస్తాయన్నన్నారు. నిర్వాహకులు సార్థక్ మాట్లాడుతూ యువతలో నాయకత్వం పెంచడానికి ఈ కార్యక్రమం దోహదకారిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసెక్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.