
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలకు చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర పబ్లిక్ వింగ్ కార్యదర్శిగా పరవాడ ఈశ్వరరావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గుడపాటి వి.డబ్ల్యూ.జోసెఫ్(విశాఖ తూర్పు), కార్యదర్శులుగా గుంట సుందర్ రావు(విశాఖ పశ్చిమ), డోల ఆనంద్(భీమిలి), ప్రత్యేక అధికార ప్రతినిధిగా అల్లంపల్లి రాజుబాబు(విశాఖ తూర్పు), రాష్ట్ర వలంటీర్ వింగ్ జోనల్ ప్రెసిడెంట్‌గా మట్టి సునీల్‌కుమార్(విశాఖ ఉత్తర), రాష్ట్ర వలంటీర్ వింగ్ సంయుక్త కార్యదర్శిగా పచ్చిరాపల్లి రామారావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ కార్యదర్శిగా శంఖబత్తుల సన్యాసిరావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా పటాన సంషద్ భేగం(విశాఖ పశ్చిమ) నియమితులయ్యారు.