
తీరం.. శుభ్రం
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని ఇండియన్ కోస్ట్‌గార్డ్–6 ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛతా హి సేవ పిలుపును స్వీకరిస్తూ.. సాగర తీరాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ), సౌత్ ఏషియా కో–ఆపరేటివ్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం(ఎస్‌ఏసీఈపీ)లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, కోస్ట్‌గార్డ్ డిస్ట్రిక్ట్ హెచ్‌క్యూ–6 కమాండర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజేష్ మిట్టల్ పాల్గొన్నారు. సీఐఎస్‌ఎఫ్, ఎన్‌సీసీ, అదానీ, హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్ సంస్థలతో పాటు పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని.. సుమారు 600 కిలోల రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్ వ్యర్థాలను, మరో 700 కిలోల ఇతర వ్యర్థాలను సేకరించారు.
చెత్త సేకరిస్తున్న హెచ్‌పీసీఎల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు