
ఆరోగ్యకర సమాజం మనందరి లక్ష్యం
విశాఖ సిటీ: పోలీసు కమిషనరేట్ ఆవరణలో శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో పాటు ఉన్నతాధికారులు మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బందితో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ స్వచ్ఛత.. ప్రతి పౌరుడి విధి అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అందరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. డీసీపీ(అడ్మిన్) కృష్ణకాంత్ పటేల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.