పోరు | - | Sakshi
Sakshi News home page

పోరు

Sep 20 2025 5:30 AM | Updated on Sep 20 2025 5:30 AM

పోరు

పోరు

IIలో ●

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కుట్రపై వైఎస్సార్‌ సీపీ పోరుబాట పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి నిరసన భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పేదలకు వైద్య విద్యను దూరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక

శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

హోరెత్తిన

విద్య, వైద్యానికి పెద్దపీట

రాష్ట్రంలో విద్య, వైద్యానికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కళాశాలలు మంజూరు చేసి చరిత్రలో నిలిచిపోయారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే.. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే పాడేరు వైద్య కళాశాల 70 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది. గత విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాలు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఎందుకు కనబడటం లేదు. గిరిజనులకు దుప్పట్లు, పండ్లు పంపించామని చెప్పుకోవడం కాదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాదిరిగా గిరిజనాభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలి.

– కేకే రాజు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ

మెడికల్‌

చలో మెడికల్‌ కాలేజ్‌ విజయవంతం

సాక్షి, పాడేరు: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ‘చలో పాడేరు మెడికల్‌ కాలేజ్‌’ విజయవంతమైంది. విశాఖ, అల్లూరి జిల్లాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పాడేరుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజా వ్యతిరేకతను చూసి భయపడిన ప్రభుత్వం.. తన నిరంకుశ ధోరణిని మరోసారి బయటపెట్టుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలను వంతాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నేతలు పోలీసులను నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ నిర్బంధకాండ కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అక్కడకు చేరుకుని, పోలీసులతో వాదించారు. వారి వాదనల తీవ్రతకు తలొగ్గిన పోలీసులు.. వాహనాలను విడిచిపెట్టడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పాడేరుకు కదంతొక్కాయి. జై జగన్‌, సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్‌ నినాదాలతో పాడేరు వీధులు మార్మోగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైద్య కళాశాల వరకు జరిగిన భారీ ర్యాలీ.. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహానికి అద్దం పట్టింది. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. పాడేరు వైద్య కళాశాలలో తరగతులు జరుగుతున్నా.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు సవిత, అనితలకు కనిపించడం లేదా అని వారు మండిపడ్డారు. పేదలకు ఉన్నత వైద్యాన్ని దూరం చేసే ఈ కుట్రను తిప్పికొడతామని హెచ్చరించారు.

పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అల్లూరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎంపీ తనూజరాణి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర జోన్‌ యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, మాజీ ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్‌కుమార్‌, చెట్టి పాల్గుణ, చింతలపూడి వెంకట రామయ్య, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్‌ వెస్లీ, పేర్ల విజయ చంద్ర, జీసీసీ మాజీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్‌ ఇన్‌చార్జి అంబటి శైలేష్‌, అల్లూరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడ శేఖర్‌, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు లోచలి వరప్రసాద్‌. విశాఖ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పులగం కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

17 వైద్య కళాశాలలు చరిత్రాత్మకం

రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం. గిరిజనులకు 500 పడకలతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మాణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. 70 శాతం పనులు పూర్తయితే కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది.

– అదీప్‌రాజ్‌,యువజన విభాగం

ఉత్తరాంధ్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, వైఎస్సార్‌ సీపీ

పాలకులకు కళ్లు కనబడటం లేదా?

పాడేరు వైద్య కళాశాలలో 70 శాతం పనులు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. గత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు కూడా పూర్తయితే కూటమి పాలకులకు కళ్లు కనబడ లేదా? పాడేరు వంటి మారుమూల ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మాణం గిరిజనులకు వరం.

– వాసుపల్లి గణేష్‌కుమార్‌,

మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం

వైద్య విద్య దూరం చేయొద్దు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలల్లో పదింటిని ప్రైవేట్‌పరం చేసి పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు దూరం చేయడం అన్యాయం. సీఎం చంద్రబా బు బినామీలు, బంధువులకు వీటిని అప్పగించే చర్యలను అడ్డుకుంటాం. ఐదు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనప్పటికీ కూటమి పాలకులు తప్పుడు ప్రచారం చేయడం దారుణం. – డాక్టర్‌ తనూజరాణి,అరకు ఎంపీ

ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదు. పేదలకు ఉచిత వైద్య విద్య, కార్పొరేట్‌ వైద్యం లక్ష్యంగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మారుమూల పాడేరు ప్రాంతంలో కూడా రూ.500 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 70 శాతం మేర పాడేరు కళాశాల నిర్మాణ పనులు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. మిగతా 30 శాతం పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు,

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ

అల్లూరి జిల్లా అధ్యక్షుడు

కదంతొక్కిన యువత

మాకవరపాలెం: వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన గళం హోరెత్తింది. వైఎస్సార్‌ సీపీ పిలుపుతో పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్‌ కాలేజ్‌’కార్యక్రమం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తపరచింది. పీపీపీ విధానం పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరం చేసేందుకేనని నేతలు మండిపడ్డారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువత వస్తుండగా బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో గల మెడికల్‌ కళాశాల ప్రాంతానికి చేరుకున్న నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ను ముందుగా పోలీసులు అడ్డుకుని, నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలులో ఉందని నోటీసులు జారీ చేశారు. 15 మందికి మించి వెళ్లకూడదనే ఆంక్షలు పెట్టారు. అయినా తగ్గేదేలే అంటూ.. మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత గళమెత్తింది.

పెండింగ్‌ పనులపై నిర్లక్ష్యం

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. పాడేరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య కళాశాల మంజూరు చేసి రూ.500 కోట్లతో పనులు చేపట్టారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడంతో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

– జల్లిపల్లి సుభద్ర, జెడ్పీ చైర్‌పర్సన్‌

పోరు1
1/9

పోరు

పోరు2
2/9

పోరు

పోరు3
3/9

పోరు

పోరు4
4/9

పోరు

పోరు5
5/9

పోరు

పోరు6
6/9

పోరు

పోరు7
7/9

పోరు

పోరు8
8/9

పోరు

పోరు9
9/9

పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement