
కాన్వెంట్ కూడలిలో మైరెన్ పార్క్ ప్రారంభం
కంచరపాలెం: కాన్వెంట్ కూడలిలో రూ.2.7 కోట్లతో నర్మించిన మైరెన్ పార్కు విశాఖ పోర్ట్ ఆథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ప్రారంభించారు. అలాగే ఇదే కూడలిలో 100 అడుగుల ఎత్తైన హైమాస్ట్ జాతీయ పతాకం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్ట్‌తో పాటు నగర సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రోడ్లు, నడక మార్గాల మధ్య పచ్చదనం పెంచడం, రాత్రివేళల్లో పోర్ట్ అందంగా కనిపించేలా విద్యుత్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాన్వెంట్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేయనున్న జాతీయ పతాకం పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్, వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.