
21 మందికి సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి
డాబాగార్డెన్స్: సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలు మరింత మెరుగ్గా నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో జీవీఎంసీలో జూనియర్ అసిస్టెంట్లగా విధులు నిర్వహిస్తున్న 21 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారు అంకితభావంతో పనిచేయాలని, జీవీఎంసీకి మరింత పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అప్పలనాయుడు పాల్గొన్నారు.