
ఆర్పీ అలివేణిని పరామర్శించిన కేకే రాజు
తాటిచెట్లపాలెం: తెలుగుదేశం పార్టీ నాయకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్పీ ఎస్.అలివేణిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గురువారం జగన్నాథపురంలోని ఆమె నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, కర్రి రామారెడ్డి, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీదేవివర్మ, భాను, నాగమని తదితరులు పాల్గొన్నారు.