
భారత్ ఎదురుదాడి చేస్తే.. అమెరికా దిగొస్తుంది
ప్రస్తుతం ఉన్న దాదాపు 3,200 జీసీసీల్లో 1,600 భారత్‌లో ఉన్నాయి. ఇందులో సగానికి పైగా యూఎస్‌కి సంబంధించినవే. వీటికీ హైర్ చట్టం వర్తిస్తే.. వాటి మనుగడ ప్రశ్నార్థకమే. ఎస్‌టీపీఐ అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడి నుంచి రూ.5 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో 70 శాతం వరకూ అమెరికా వాణిజ్యమే. వీటన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో హైర్ చట్టం అమల్లోకి రాదనే భావిస్తున్నాం.ఒకవేళ ఈ ప్రతిపాదనని చట్టబద్ధం చేస్తే.. భారత్ కూడా ఎదురుదాడి చెయ్యాలి. అమెరికా ఆధారిత ఐపీ ఉత్పత్తులని నిషేదించడం, మైక్రోసాఫ్ట్ అడోబ్ వంటి ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటిస్తే.. అమెరికా దిగొస్తుంది.
– శ్రీధర్ కొసరాజు,
ఏపీ డీప్‌టెక్ నైపుణ్య సంస్థ ప్రతినిధి