
ఓపీటీ విద్యార్థులపైనా ప్రభావం
అమెరికా ప్రతిపాదిస్తున్న ఈ హైర్ చట్ట కంపెనీలు ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విద్యార్థులపై కూడా పన్ను విధిస్తుంది. ఓపీటీపై కూడా పన్ను విధించాలని ఇప్పటికే యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదించారు. ఇప్పటివరకు యూఎస్‌లో ఓపీటీ కింద పనిచేస్తున్న విదేశీ విద్యార్థులకు ఎఫ్‌ఐసీఏ పన్నులు చెల్లించకుండా మినహాయింపు లభించేది. ఈ కొత్త చట్టం కనుక అమలులోకి వస్తే విదేశీ విద్యార్థులు కూడా ఈ పన్ను పరిధిలోకి వచ్చి వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా.. యూఎస్ వెళ్లి.. చదువుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలనుకున్న విద్యార్థులకు ఈ చట్టం గొడ్డలిపెట్టులా మారనుంది.
– బి. కోటేశ్వరరావు, ఐటీ ఉద్యోగి