
అమెరికా సంస్థలు, ప్రజలపైనే భారం
భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకొస్తున్న చట్టమే ఇది. తొలుత గూడ్స్‌పై రెండు సార్లు 25 శాతం చొప్పున సుంకాలు విధించారు. అప్పటికీ భారత్ దిగిరాలేదని భావించి.. నైపుణ్యాలపై దెబ్బతీసేందుకు హైర్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతోంది. దీనివల్ల భారత్ కంటే అమెరికాకే ఎక్కువ భారం. ఉదాహరణకు ఒక ఐటీ సంస్థ యూఎస్ సిటిజన్‌ని హైర్ చెయ్యాలంటే 10 వేల డాలర్లు చెల్లించాలి. అదే భారతీయులకు 2500 డాలర్లు వరకూ చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు భారతీయుల్ని తప్పించేందుకు యత్నిస్తే.. యూఎస్ కంపెనీలపైనా, అమెరికా ప్రజలపైనే ఈ భారమంతా పడుతుంది. – ఒ. నరేష్,
రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్