
కరుణకుమారికి కలెక్టర్ అభినందన
మహారాణిపేట: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణకుమారి భారత్ వేదికగా నవంబర్‌లో జరగనున్న అంధ మహిళల టీ–20 ప్రపంచకప్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అభినందించారు. డీఈవో ప్రేమకుమారి, అంధ పాఠశాల నిర్వాహకులు గురువారం కరుణకుమారిని కలెక్టర్ చాంబర్‌కు తీసుకురాగా కలెక్టర్ విద్యార్థినికి శాలువా కప్పి, స్వీట్ తినిపించి సత్కరించారు. ప్రాక్టీస్ కోసం కరుణకు రెండు ప్రత్యేక క్రికెట్ కిట్‌లు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సాగరనగర్‌లోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కరుణకుమారి స్వగ్రామం వంట్లమామిడి.