
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం
మహారాణిపేట: జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి బుధవారం ఉదయం 11.16 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్థానిక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్‌లు గణబాబు, వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలోను, రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యారు. అనంతరం రాత్రి 8.55 గంటలకు విమానంలో తిరుగు పయనమయ్యారు.