
మాడ్యులర్ ఎంబీఏ కోసం అవగాహన ఒప్పందం
తగరపువలస: జాతీయ ప్రాధాన్యత గల మాడ్యులర్ ఎంబీఏ కోసం ఐఐఎంవీ, ఐఐఐటీ మణిపూర్‌ల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. గంభీరం ఐఐఎంవీలో బుధవారం ఐఐఎంవీ డైరెక్టర్ చంద్రశేఖర్, మణిపూర్‌లోని సేనాపతి ఐఐఐటీ డైరెక్టర్ కృష్ణన్‌భాస్కర్‌లు ఈ ఒప్పందపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో ప్రముఖ 18 ఎన్‌ఐటీ, ఐఐఐటీలకు విశాఖ ఐఐఎం పీజీపీఎంసీఐ సహకారం అందిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులు, గ్రాడ్యుయేట్ల కోసం మాడ్యులర్ ఎంబీఏ రూపొందించినట్లు వెల్లడించారు. ఇది బీటెక్, ఎంటెక్ డిగ్రీలతో పాటు అవసరమైన నిర్వహణ పరిజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. ప్రొగ్రాంలో భాగంగా ఈ నెల 30 వరకు అడ్మిషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొగ్రాం చైర్ ప్రొఫెసర్ ఎం.షమీమ్ జావేద్, డీన్ మారిశెట్టి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.