
జాతీయస్థాయి టెన్నీకాయిట్ పోటీలకు గురుకుల విద్యార్థి
సబ్బవరం: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి పి.సాగర్ టెన్నీకాయిట్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో కోనసీమ జిల్లా, మండపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. వచ్చే నెల 8 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి కేఎన్‌వీ సత్యనారాయణ(పైసా)కు ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సాగర్‌తో పాటు, శిక్షణ ఇచ్చిన పీడీ, పీఈటీలు సీఎల్‌ఎన్ ప్రసాద్, వి.సూర్యనారాయణలను ప్రిన్సిపాల్‌తోపాటు, వైస్ ప్రిన్సిపాల్ కె.చిరంజీవి, ఉపాధ్యాయులు రాంబాబు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.