
జనారణ్యంలోకి కొండ మేక
మధురవాడ: కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి శనివారం సాయంత్రం పీఎం పాలెం ఆఖరి బస్టాప్ వద్ద గల జన సమూహంలోకి ఒక కొండ గొర్రె వచ్చింది. కుక్కలు తరిమి దాడి చేయడంతో ఓ నివాసంలోకి వచ్చి చేరింది. స్థానికులు దానికి రక్షణ కల్పించి అఽధికారులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి.వి.శాస్త్రి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జంతువు అరుదైన కొండ మేకని అన్నారు. కొండ మేక, కొండ గొర్రెలు అరుదుగా ఉన్నాయన్నారు. ఇది చూలుతో ఉందని, కుక్కలు మూతి మీద గాయాలు చేశాయని తెలిపారు. వైద్యంతోపాటు రక్షణ కూడా అవసరమని చెప్పారు. రేంజ్ ఆఫీసర్ సమాచారంతో జూ వైద్యుడు శ్రీనివాస్ అక్కడికి చేరుకుని ప్రాథమిక వైద్య అందించి కేవ్‌లో కొండ మేకని విశాఖ జూ పార్కుకు తరలించారు.