
సాగరతీరంలో ‘విష్ణు విన్యాసాలు’
కొమ్మాది: బీచ్‌రోడ్డులోని సాగర్‌నగర్ వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు హీరో శ్రీవిష్ణు, హీరోయి న్ నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి షూటింగ్ జరిగింది. వర్షం పడుతున్న నేపథ్యంలో హీరో, హీరోయిన్లు కలిసే సందర్భానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. తెల్లవారుజామున వ్యాయామం కోసం వచ్చిన వారు సినిమా షూటింగ్‌ను చూసి నటీనటులతో సెల్ఫీలు దిగారు. కాగా.. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసాలు’ అనే పేరు ప్రచారంలో ఉంది.