
కూటమి పాలనలో బీసీలపై దౌర్జన్యాలు
డాభాగార్డెన్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన బీసీ నేత, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై టీడీపీ గూండాల దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో జరిగిన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. గ్రీన్‌పార్కు హోటల్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూటమి సర్కార్ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీలపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేని స్థితిలో ఉంటే.. అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.? అనే సందేహం కలుగుతోందన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచే సత్తా లేకపోవడంతో.. రౌడీయిజంతో ఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ముఖ్యనేతలు డాక్టర్ జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు పీవీ సురేష్, బిపిన్‌కుమార్ జైన్, పల్లా దుర్గారావు, బోని శివరామకృష్ణ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, అల్లంపల్లి రాజుబాబు, మారుతిప్రసాద్, ఎం.రమేష్, కనకరెడ్డి, పీతల గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడిని
ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు