
పేదల భూములపై సర్కారు కన్ను
మహారాణిపేట: పేదల భూములపై కూటమి సర్కార్ కన్నుపడింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా పేదల భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను సేకరించనున్నారు. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 1941 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సేకరించిన ఈ భూములను వీఎంఆర్‌డీఏకు అప్పగించి, వాటిని విక్రయించడం ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోంది. ఇలా వచ్చిన నిధులను ప్రబుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవడంపై దృష్టి సారించింది. అసైన్డ్ పట్టా ఉంటే ఎకరానికి 900 గజాలు, ఆక్రమణదారుడైతే ఎకరానికి 450 గజాల స్థలం డెవలప్‌మెంటు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ కోసం 2016లో చేసిన చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్యవేక్షణలో ఆర్‌డీవోలు భూసమీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఈ భూముల సేకరణ కోసం సోమవారం నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ భూసేకరణ అంతా పారదర్శకంగా చేస్తామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం మీడియాతో జేసీ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అంతా భూ సేకరణ జరుగుందన్నారు. రికార్‌ుడ్స ట్యాంపరింగ్ జరగకుండా చూస్తామని, రికార్డులను బట్టి ఆక్రమణదారులను గుర్తిస్తామన్నారు.
విశాఖ జిల్లాలో..
ఆనందపురంలో గిడిజాలలో258 సర్వే నంబర్‌లో 309.18 ఎకరాలు
ఆనందపురంలో గోరింట్ల సర్వే నంబర్ 108లో 198.31 ఎకరాలు
ఆనందపురంలో శోంఠ్యంలో 347/పీ సర్వే నంబర్‌లో 251.55 ఎకరాలు
ఆనందపురంలో బీ.డీ.పాలెంలో సర్వే నంబర్ 1లో 122.53 ఎకరాలు
పద్మనాభంలో కొవ్వాడ 237 సర్వే నంబర్‌లో
250.52 ఎకరాలు
భూములమ్మి..నిధుల సేకరణ
ప్రభుత్వ ఆదేశాలతో భారీగా ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన అధికారులు
అసైన్డ్ భూములు, ఆక్రమణల్లో ఉన్న భూముల సేకరణకు కసరత్తు
విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 1,941 ఎకరాల సేకరణే లక్ష్యం
నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ కలెక్టర్
ఈ భూములను వీఎంఆర్‌డీఏకు అప్పగించేందుకు చర్యలు
భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వ ఆలోచన
సేకరించే భూముల వివరాలు
విజయనగరంలో డెంకాడలో సర్వే నంబర్లు 241, 242, 243ల్లో 20.41 ఎకరాలు భోగాపురం మండలంలో రావాడ సర్వే నంబర్ 64/1లో 5 ఎకరాలు
అనకాపల్లి జిల్లాలో ..
సబ్బవరం మండలం అంతకాపల్లిలో
175.42 ఎకరాలు
బాటజంగాలపాలెంలో 141.01 ఎకరాలు
ఏ.సిరసపల్లిలో 371.75 ఎకరాలు
నాళ్ల రేగుడిపాలెంలో 27.37 ఎకరాలు
పైడివాడ అగ్రహరంలో 28.14 ఎకరాలు
అనకాపల్లి మండలంలో తగరంపూడిలో
40 ఎకరాలు
మొత్తం 1941 ఎకరాల 19 సెంట్లు భూమి సేకరిస్తున్నారు