
ఐదుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు
విశాఖ ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్) భూ సర్వేలో నాకు చెందిన 30 సెంట్ల భూమిని కాపాడాలి. గతంలో ఐదుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశా. నా భూమిని సర్వే చేసిన ఆర్‌ఐ అప్పారావు, సర్వేయర్ హరీష్ ఇబ్బందులు పెడుతున్నారు. పెదగంట్యాడ మండలం సర్వే నంబర్ 71/1/బి/3లో ఉన్న 30 సెంట్ల భూమి నా తాతాముత్తాల నుంచి వారసత్వంగా వచ్చింది. స్టీల్ ప్లాంట్ కోసం కొంత భూమిని తీసుకున్న తర్వాత మిగిలిన భూమిని సబ్–డివిజన్ చేసి ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. ఈ భూమిలో బడ్డీ కొట్టు, ఇల్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నా..అయితే స్టీల్ ప్లాంట్ అధికారులు తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. గతంలో భూములు కోల్పోయినప్పటికీ, ఈనాటికీ ఉద్యోగం, పరిహారం గానీ అందలేదు. సమస్యను వెంటనే పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– కొల్లి రవణమ్మ, పెదగంట్యాడ