
విశాఖలో నర్సుల రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు
సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహణ
బీచ్‌రోడ్డు: ట్రైన్‌డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ) 31వ రాష్ట్ర ద్వైవార్షిక సదస్సు సెప్టెంబరు 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్. షంషేర్ బేగం శనివారం నగరంలోని ఒక హోటల్‌లో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో–ది జర్నీ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్’అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని ఏయూ కాన్వొకేషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ నర్సెస్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సత్యవల్లి, కౌన్సిల్ సభ్యురాలు, నర్సింగ్ ఎడ్యుకేషన్ అధ్యక్షురాలు డి.ఉష పన్నాగవేణి పాల్గొన్నారు.