● జిల్లాలో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు రాక ● గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం 5 లక్షల మందితో యోగాసనాలు ● ఈ వేడుక నిర్వహణ ఖర్చు రూ.75 కోట్లగా అంచనా ● ఇప్పటి వరకు పైసా విదల్చని ప్రభుత్వం ● అధికారుల మల్లగుల్లాలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు రాక ● గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం 5 లక్షల మందితో యోగాసనాలు ● ఈ వేడుక నిర్వహణ ఖర్చు రూ.75 కోట్లగా అంచనా ● ఇప్పటి వరకు పైసా విదల్చని ప్రభుత్వం ● అధికారుల మల్లగుల్లాలు

Jun 3 2025 6:48 AM | Updated on Jun 3 2025 6:48 AM

● జిల్లాలో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ

● జిల్లాలో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ

ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు భారీ సంఖ్యలో హాజరవుతారని చెబుతున్నారు. ఇప్పటివరకు కార్యక్రమం నిర్వహణపై సమీక్షలు, ప్రాంతాల పర్యటనలు మాత్రమే జరిగాయి. ఆర్‌.కె.బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు బీచ్‌ రోడ్డులో ఈ ‘యోగా బ్రహ్మాండం’ నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నారు.

500 కంపార్టుమెంట్ల నిర్మాణం

సుమారు ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు వీలుగా బీచ్‌రోడ్డులో 500 కంపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. తొక్కిసలాటలు జరగకుండా, ముందుగా ప్రజలను ఈ కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించి, వారిచేత యోగాసనాలు, విన్యాసాలు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క కంపార్ట్‌మెంట్‌లో వెయ్యి మంది చొప్పున మొత్తం ఐదు లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్‌మెంట్ల నిర్మాణంతో పాటు, వేదికల నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ వేదికల మీదుగా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. బీచ్‌రోడ్డులోని కొన్ని ప్రాంతాలకు ఇన్‌చార్జులుగా జిల్లా అధికారులను నియమిస్తున్నారు.

భారం ఎవరిది?

‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ఖర్చు భారం ఎవరిపై పడుతుందనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మొదట అంగీకరించిన విధంగా 2 లక్షల మ్యాట్లు, టీ–షర్టులు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం 5 లక్షల మందితో యోగాసనాలు వేయించాలని నిర్ణయించ డంతో మిగిలిన 3 లక్షల మ్యాట్లు, టీ–షర్టుల భారం ఎవరు భరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో మ్యాట్‌ ఖరీదు సుమారు రూ.340 కాగా, 3 లక్షల మ్యాట్లకు రూ.10 కోట్లకుపైగానే ఖర్చవుతుందని అంచనా. దీంతో పాటు యోగాలో పాల్గొనే ఆహారానికి ఒక్కొక్కరికి రూ.100 ఖర్చవుతుంది. 5 లక్షల మందికి రూ.5 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటితో పాటు, వీఐపీలు, వీవీఐపీల హోటల్స్‌, కార్లు, స్టేజ్‌ నిర్మాణాలకు, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చులు అదనం. అధికారుల పరిస్థితి చూస్తుంటే, బడ్జెట్‌ లేకుండానే ఐదు లక్షల మందితో యోగా చేయించాలన్న ఆశకు ‘ధనాసనం’ వేయక తప్పదేమో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement