
మొదలైన న్యాయవాదుల నామినేషన్ పర్వం
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి, ప్రముఖ న్యాయవాది జీఎం రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్లు పర్వం మొదలైంది. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పలువురు న్యాయవాదులు నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, సాంస్కృతి కార్యదర్శి, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. 18వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ పర్వం కొనసాగుతుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20 వరకు ఉపసంహరణ, అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 28వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు.