
ఘనంగా సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే
కంచరపాలెం: విశాఖ పోర్ట్ అథారిటీ 56వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్‌డే సాలిగ్రామపురం సీఐఎస్‌ఎఫ్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల రక్షణలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. సీఐఎస్‌ఎఫ్ యూనిట్ తన సత్తా, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ డాగ్ షో, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, పిరమిడ్ ఫార్మేషన్, ఫైర్ డ్రిల్ నిర్వహించారు. సీఐఎస్‌ఎఫ్ యూనిట్ సీనియర్ కమాండెంట్ సతీష్‌కుమార్ బాజ్‌పాయ్, పీఎస్‌ఎల్ స్వామి, టి.వేణుగోపాల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.