విశాఖ విద్య: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతగా జరిగాయి. ఉదయం జరిగిన ఫస్టియర్ పరీక్షకు 16,180 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 15,643 మంది హాజరయ్యారు. 97 శాతం హాజరు నమోదైనట్లు ఆర్‌ఐవో పి.మురళీధర్ తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షకు 538 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 464 మంది హాజరయ్యారు. 86 శాతం హాజరు నమోదైనట్లు ఆర్‌ఐవో తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. అదేవిధంగా ఆర్‌ఐవో మురళీధర్, డీవీఈవో రాధ జిల్లాలోని పలు కేంద్రాలను తనిఖీ చేసి, మాస్ కాపీయింగ్ ఆస్కారం లేకుంగా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.