
భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తున్న చినజీయర్ స్వామి
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని కీతిన్‌పేట వద్దనున్న ఐశ్వర్య వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ముందుగా ఆయన చేతులమీదుగా ఐశ్వర్య లక్ష్మి అమ్మవారికి లక్ష్మి హవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొనడంతోపాటు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కలిగొట్ల శ్రీరామచంద్రమూర్తి, కే.ఎస్.ఎన్.మూర్తి, కే.భానోజిరావు, కే.శ్రీనివాసరావు, కే.చంద్రశేఖరరావు, వీ.తాతాజీ, ఆలయ అర్చకులు పురాణం శేషాచార్యులు పాల్గొన్నారు.